అందం అద్దంలో చుస్తే ఈ బ్యూటీ రూపమే కనిపిస్తుందేమో..
TV9 Telugu
23 April 2024
20 ఆగస్టు 1995 సంవత్సరంలో మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబై నగరంలో పుట్టి పెరిగింది వయ్యారి భామ కావ్య థాపర్.
ముంబైలోని పోవై ఆ ప్రాంతంలో ఉన్న బొంబాయి స్కాటిష్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ అందాల తార.
ముంబైలో ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ పట్టా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
2013లో ఒక యూట్యూబ్ షార్ట్ హిందీ ఫిల్మ్‌లో నటించి తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది ఈ వయ్యారి భామ.
పతంజలి, మేక్‌మైట్రిప్ మరియు కోహినూర్ వంటి అనేక ప్రముఖ వాణిజ్య ప్రకటనలలో కూడా కనిపించింది ఈ అందాల తార.
2018లో ఈ మాయ పేరేమిటో అనే తెలుగు రొమాంటిక్ చిత్రంలో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.
2021లో ఏక్ మినీ కథ అనే తెలుగు అడల్ట్ కామెడీ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన నటించింది. రెండు తమిళం, ఓ హిందీ చిత్రాల్లో కూడా నటించింది.
తాజాగా ఈగల్, ఊరి పేరు భైరవకోన అనే రెండు తెలుగు చిత్రాల్లో నటించింది. ఇవి రెండు ఫిబ్రవరి 9న విడుదల కానున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి