కావ్య పాప కొత్త సినిమా ఎప్పుడు.? సైలెంట్ అయిన బలగం బ్యూటీ..

12 September 2024

Rajeev 

 చైల్డ్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో సినిమాలు చేసింది కావ్య కళ్యాణ్ రామ్. తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించింది ఈ భామ.

ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. మసూధ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ.

ఆతర్వాత నటుడు వేణు తెరకెక్కించిన  బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది.

ఆతర్వాత ఉస్తాద్ చిత్రంలో నటించింది. ఇందులో శ్రీసింహా హీరోగా నటించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది.

ప్రస్తుతం కావ్య కళ్యాణ్ రామ్ సైలెంట్ అయ్యింది. కొత్త సినిమాలను ఇంతవరకు అనౌన్స్ చేయలేదు.

ఈ అమ్మడు ఎప్పుడు సినిమా అనౌన్స్ చేస్తుందా.? అని ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

కానీ కావ్య సోషల్ మీడియాతోనే బిజీగా గడిపేస్తోంది. ఇన్ స్టాలో రకరకాల ఫోటోలు షేర్ చేసి ఆకట్టుకుంటుంది.