27 october 2023

 డ్యాన్స్‌ అంటే ప్రాణం.. ఎంత కష్టమైనా భరిస్తా: కత్రినా కైఫ్‌

తెలుగులో మల్లీశ్వరిగా మెప్పించిన కత్రినా కైఫ్‌ ఇప్పుడు బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగొందుతోంది

హిందీ పరిశ్రమలో వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తూ విజయాలు సొంతం చేసుకుంటోందీ బాలీవుడ్  అందాల తార

త్వరలోనే  సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తో కలిసి మరోసారి మన ముందుకు రానుంది.  టైగర్‌ 3 సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. 

తాజాగా ఈ మూవీ నుంచి లేకే ప్రభు కా నామ్‌ అనే పాట రిలీజ్‌ కాగా స్టెప్పులతో అదరగొట్టిందీ స్టార్‌ హీరోయిన్‌

ప్రస్తుతం టైగర్‌ 3 మూవీకి సంబంధించి కత్రినా కైఫ్‌ సాంగ్‌, డ్యాన్స్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి

తాజాగా వీటిపై స్పందించిన కత్రినా తనకు డ్యాన్స్‌ అంటే ఎంతో ప్రాణమని, జనాన్ని మెప్పించేందుకు ఎంత కష్టమైనా పడతానంది