ఈ అమ్మడి అందానికి ఆ గులాబీ కూడా ఫిదా అవుతుందేమో..

18 December 2023

3 నవంబర్ 1997న మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణేలో ఓ మరాఠి కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ కాశ్మీర పరదేశి.

మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణెలోని సెయింట్ ఆన్స్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది ఈ అందాల తార.

తర్వాత మహారాష్ట్రలోని పూణె నగరంలో ఉన్న బృహన్ మహారాష్ట్ర కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో చదువుకుంది ఈ ముద్దుగుమ్మ.

ముంబైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైన్‌ను అభ్యసించింది ఈ అందాల సుందరి.

2012లో పూణేలోని బృహన్ మహారాష్ట్ర కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో జరిగిన ‘క్లీన్ & క్లియర్ పూణే టైమ్స్ ఫ్రెష్ ఫేస్’ టైటిల్‌ను గెలుచుకుంది.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ లో కెరీర్ మొదలుపెట్టిన ఈమె.. అనే కమర్షియల్ యాడ్స్ లో నటించింది.

2018లో నాగ శౌర్యకి జోడిగా తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం @నర్తనశాల చిత్రంతో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది.

తర్వాత 2023లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సరసన వినరో భాగ్యము విష్ణు కథలో కనిపించింది. దీనికి ముందు ఇతర భాషల్లో కొన్ని చిత్రాలు చేసింది.