తెలుగులో కోట్లు కురిపించిన కశ్మీర్.. మరి విజయ్ దళపతికీ..
18 September 2023
లెఫ్టనెంట్ రామ్, సీతామాలక్ష్మి... ఈ రెండు పేర్లు సిల్వర్‌స్క్రీన్ మీద చేసిన మ్యాజిక్‌ని తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు.
నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కశ్మీర్‌ని రామ్ మంచుకు వదిలేసి వచ్చేస్తే, ఇక్కడ బాక్సాఫీస్‌ని ఆడియన్స్ కాసులతో కళకళలాడించారు.
సీతారామమ్‌తో చల్లగా ప్రేక్షకుల మనసుల్లోకి చేరిన కశ్మీర్ విజయ్ దేవరకొండ ఖుషీ సినిమాతో మళ్లీ సందడి చేసింది.
అప్పుడెప్పుడో మణిరత్నం డైరక్ట్ చేసిన రోజా సినిమాను గుర్తుచేస్తూ, కశ్మీర్‌లో విజయ్ దేవరకొండ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.
విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషి సినిమాకు యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి బెస్ట్ రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు సేమ్ రిజల్ట్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు కోలీవుడ్ విజయ్. తెలుగులో విజయ్ దేవరకొండ, సమంతకు కలిసొచ్చిన కశ్మీర్, తమిళ్‌లో విజయ్‌కీ, త్రిషకీ కలిసొస్తుందా?
లోకష్ డైరక్షన్‌లో దళపతి నటిస్తున్న సినిమా లియో. అక్టోబర్ 19న విడుదల కానుంది. బ్లడీ స్వీట్ అంటూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ స్టఫ్‌కి ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ కూడా ఉంది.