26 June 2025
అబ్బో అమ్మడు.. సీరియల్లో పనిమనిషి.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. అరాచకమే
Rajitha Chanti
Pic credit - Instagram
సీరియల్స్ ద్వారా బుల్లితెరపై ఫేమస్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. సీరియల్ భామలు సినిమా హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోని అందంతో కట్టిపడేస్తున్నారు.
అందం, అభినయంతో ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక సీరియల్స్‌లో విలన్ పాత్రలలో కనిపించే బ్యూటీస్ గ్లామర్ లుక్స్‌తో రచ్చ చేస్తున్నారు.
కానీ సీరియల్లో పనిమనిషిగా కనిపించిన ఈ అమ్మడు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో అందాలతో పాపులర్ అవుతుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ?
బుల్లితెరపై సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కార్తీక దీపం సీరియల్ నటి. డాక్టర్ బాబు, వంటలక్క, మోనితా పాత్రలతోపాటు పనిమనిషి పాత్ర సైతం ఫేమస్ అయ్యింది.
కార్తీక దీపం సీరియల్లో మోనితా వద్ద పనిమనిషి ప్రియమణి పాత్రలో కనిపించింది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ అప్పట్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.
ఆమె పేరు అంబటి దివ్య. కార్తీక దీపం సీరియల్ ద్వారానే గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. నెట్టింట చాలా యాక్టివ్..
సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్. సీరియల్లో పద్దతిగా కనిపించే ఈ బ్యూటీ.. బయట మాత్రం గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేలా కనిపిస్తుంది.
తాజాగా ఈ అమ్మడు న్యూలుక్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ప్రస్తుతం బుల్లితెరపై కార్తీక దీపం తర్వాత మరికొన్ని సీరియల్స్ చేస్తూ అలరిస్తుంది దివ్య.