23 October 2024

ప్రభాస్ సినిమాను కరీనా రిజెక్ట్ చేసిందా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తం చేసిన హీరోలలో ప్రభాస్ ఒకరు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా మారాడు.

ఈ సినిమాతో  వరల్డ్ వైడ్ ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం చేతిలో అరడజను సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. 

ఈ క్రమంలోనే యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ప్రభాస్ ఓ సీరియస్ పోలీస్ స్టోరీతో రాబోతున్నాడు. ఇదివరకే అనౌన్స్మెంట్ వచ్చింది.

స్పిరిట్ అనే టైటిల్‏తో రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ నటించనున్నట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. 

ఇందులో కరీనా పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ పై ఓ క్రేజ్ న్యూస్ వినిపిస్తుంది. 

అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమాలో నటించేందుకు కరీనా నో చెప్పిందని సమాచారం. స్పిరిట్ ప్రాజెక్ట్ ఆఫర్ ఆమె రిజెక్ట్ చేసిందని టాక్ నడుస్తుంది. 

గతంలో కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తోన్న టాక్సిక్ సినిమాను కూడ ఆమె తిరస్కరించినట్లు టాక్ నడుస్తుంది. ఇప్పుడు ప్రభాస్ సినిమా రిజెక్ట్ చేసిందంట. 

అయితే ప్రభాస్ సినిమా రిజెక్ట్ చేసినట్లు వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని చెప్పింది కరీనా. తనను సంప్రదించలేదని అసలు విషయం చెప్పేసింది.