TV9 Telugu
సౌత్ కు క్యూ కట్టిన నార్త్ భామలు.! ఇప్పుడు కరీనా కూడా.?
19 March 2024
ఒకప్పుడు తెలుగు హీరోయిన్స్ బాలీవుడ్‌లో ఒక్క సినిమా చేసిన చాలు అదొక ప్రమోషన్ వచ్చినట్టు ఫీలయ్యేవారు.
ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సౌత్ సినిమాలో చేయబోతున్నా అని సంతోషంగా చెప్పుకుంటున్నారు ముంబై గర్ల్స్.
లేటెస్ట్ గా ఈ లిస్టులో పేరు ఎంట్రీ చేసుకున్నారు నటి కరీనాకపూర్. సౌత్‌లో ఓ స్టార్ హీరో సినిమాకు సైన్ చేశా.
ఆ హీరో మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నా అని చెప్తూ సంతోషపడ్డారు ఈ భామ.
మొదటిసారి సౌత్ మూవీ చేస్తుండటంతో ఒకరకమైన ఎమోషన్ వెంటాడుతోంది అని ఓ కాన్వర్జేషన్‌లో చెప్పారు కరీనా.
ఆమె నటిస్తుంది యష్ సినిమా టాక్సిక్‌లో అనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ మలయాళ డైరక్టర్ డైరక్ట్ చేస్తున్నారు.
ఆల్రెడీ ఈ ఏడాది దేవరతో జాన్వీ కపూర్, కల్కి తో దీపిక పదుకోన్ సౌత్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
సో.. కరీనా, వాళ్లందరి దగ్గరా సలహాలు తీసుకుంటారా అనేది ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ అనే చెప్పాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి