28 November 2023

గూస్ బంప్స్ వచ్చేలా చేస్తున్న రిషబ్ షెట్టి లుక్..

రిషెబ్ షెట్టి హీరోగా.. డైరెక్టర్‌గా తెరకెక్కుతున్న మరో ఫిల్మ్ కాంతార ఎ లెజెండ్ ఛాప్టర్ 1

కాంతార1కి ప్రీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే అందర్లో అంచనాలు పెంచేసింది. 

దాంతో పాటే.. ఈ మూవీ గురించి అందరూ వెయిట్ చేసేలా చేసింది.

ఇక తాజాగా కాంతార ప్రీక్వెల్ నుంచి ఫస్ట్ లుక్ టీజర్‌ రిలీజ్ అయింది. 

ఇక ఆ టీజర్లో రిషబ్ షెట్టి... చేతిలో శూలంతో.. జులపాల్లాంటి జుట్టుతో... 

భారీ గడ్డంతో.. మీస కట్టుతో.. అచ్చం.. పరమేశ్వరుడి ఉగ్ర అవతారంలా... కనిపిస్తున్నాడు. 

తన అవతారంతోనే.. అందర్నీ భయపడేలా.. ఒళ్లు జలదరించేలా చేస్తున్నారు. 

అంతేకాదు జస్ట్ ఫస్ట్ లుక్ టీజర్‌తోనే.. సినిమాపై అమాంతంగా అంచనాలు పెంచేశారు రిషబ్ షెట్టి.