24 March 2025

కేక పెట్టిస్తున్న కన్నప్ప హీరోయిన్.. లేటెస్ట్ పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే

Rajeev 

Pic credit - Instagram

ప్రీతీ ముకుందన్ మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తుంది. 

ప్రీతీ తన నటనా జీవితాన్ని డాన్స్ షోలతో ప్రారంభించింది. ఆతర్వాత ఓ మ్యూజిక్ ఆల్బమ్ తో ఆకట్టుకుంది. 

 2022లో విడుదలైన "ముత్తు ము2" అనే మ్యూజిక్ ఆల్బమ్‌తో వచ్చింది. ఇది యూట్యూబ్‌లో 4.2 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

2024లో విడుదలైన హారర్ కామెడీ చిత్రం "ఓం భీమ్ బుష్" సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.

ఇందులో ఆమె విష్ణు సరసన నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే తమిళ చిత్రం "స్టార్" సినిమాతో హిట్ అందుకుంది. 

ప్రస్తుతం ఈ ముద్దగుమ్మ  మంచు విష్ణు నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం "కన్నప్ప"లో హీరోయిన్ గా నటిస్తోంది.

సోషల్ మీడియాలో తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫోటోలను వదిలింది. ఈ ఫోటోలు నెటిజన్స్ చూపుతిప్పుకోకుండా చేస్తున్నాయి.