అయోధ్య రామ మందిరంలోనే నా పెళ్లి: కన్నడ నటుడు..

TV9 Telugu

29 January 2024

నేను రామభక్తుడిని అయోధ్య రామ మందిరంలోనే పెళ్లి చేసుకుంటానంటూ కన్నడ నటుడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేసారు.

ఐశ్వర్య అనే అమ్మాయితో అరుణ్ రామ్‌ గౌడ దాదాపు పదేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. త్వరలోనే ఆమెతో పెళ్లి పీటలు ఎక్కాలని అనుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే ఇటీవల ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. అది కూడా అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన జనవరి 22వ తేదీనే.

అట్టహాసంగా జరిగిన వీరి నిశ్చితార్థానికి శివరాజ్‌కుమార్‌, ఉపేంద్ర సహా పలువురు కన్నడ నటులు హాజరయ్యారు.

రామాలయ ప్రారంభోత్సవం నాడే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న రామ్‌ గౌడను పెళ్లి ఎప్పుడు అని పలువురు అడగ్గా ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు.

తాను అపర రామ భక్తుడిని అని.. అందుకే అయోధ్య శ్రీరాములవారి సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.

అరుణ్ రామ్‌ గౌడ కన్నడలో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాల కన్నడ సినిమాల్లో అయన నటనతో ఆకట్టుకున్నారు.

ముద్దు మనసే, 3 గంటే 30 దిన 30 సెకండ్, పతిబేకు.కామ్, యువరత్న, లవ్ యూ రచ్చు వంటి చిత్రాల్లో అయన నటించారు.