16 June 2024

ఆ అందమేంట్రా సామి.. అర్జున్ చిన్న కూతురిని చూస్తే మైండ్ బ్లాంకే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

యాక్షన్ కింగ్ అర్జున్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, కన్నడ భాషలలో అనేక సినిమాల్లో నటించారు. ఇటీవలే ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య వివాహం జరిగింది. 

కోలీవుడ్ యంగ్ హీరో ఉమాపతితో అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిన్న కూతురు అంజన ఫోటోస్ వైరలవుతున్నాయి. 

అంజన అర్జున్.. అక్క మాదిరిగా సినీరంగంలోకి కథానాయికగా కాకుండా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ప్రముఖ వ్యాపారవేత్తగా రాణిస్తుంది. 

హైదరాబాద్‏లో హ్యాండ్‌బ్యాగ్‌ల తయారీ యూనిట్‌ను స్టార్ట్ చేయగా.. గవర్నర్ తమిళిసై సౌందరాజన్ ఈ సంస్థను ప్రారంభించి ఆమెను ప్రత్యేకంగా అభినందించింది. 

ప్రస్తుతం అంజన పారిశ్రామికవేత్తగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. పండ్ల తొక్లను ఉపయోగిస్తూ  హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 

పండ్ల తొక్కలను వాడే ప్రత్యేకమైన ఫార్ములాతో ఈ హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేస్తుంది. ఈ పద్దతిని ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరు ఉపయోగించలేదు. 

మొదటిసారిగా అంజనా అర్జున్ ఈ పద్దతిని ఉపయోగిస్తుంది. అంజనా ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. 

అంజన అచ్చం హీరోయిన్‍లా ఉందని.. కానీ ఇండస్ట్రీని కాకుండా వ్యాపార రంగాన్ని ఎంచుకుని తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుందని కామెంట్స్ చేస్తున్నారు.