TV9 Telugu
దేశం చాలా ఇచ్చింది.. తిరిగి ఇవ్వాల్సిన సమయం ఇది: కంగనా..
28 Febraury 2024
ప్రముఖ సినీ నటి కంగనా రనౌత్ దేశంలోని నంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్ TV 9 వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్‌లో రెండవ రోజు పాల్గొంది.
ఈ సందర్భంగా ఆమె సినిమా గురించి, దాని ప్రయాణం గురించి మాట్లాడింది. మన సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకున్నాయంది.
ఈ దేశం నాకు చాలా ఇచ్చింది, కాబట్టి దేశానికి ఏదైనా తిరిగి ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నాను అని కంగనా చెప్పింది.
నేను ఎప్పుడూ నన్ను జాతీయవాదిగా భావించాను. జయలలిత పాత్ర తనకు ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపింది నటి కంగనా.
మన సమాజం, మన ఘర్షణలు, మన సంస్కృతి సంప్రదాయాల గురించి లోతైన కథ, కథనంతో సినిమాలు వస్తే అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని కంగనా అభిప్రాయపడింది.
హిందీ నుంచి తమిళంలోకి మారిన సందర్భంగా మాట్లాడుతూ, “ఈ దేశం, దేశ ప్రజలు నాకు రెక్కలు ఇచ్చారు. దేశంలోని నలుమూలల నుంచి నాకు ప్రేమ వచ్చింది.
నేను నార్త్ తో పాటు దక్షిణాదిలో పనిచేశాను. నేను ఢిల్లీకి చెందిన అమ్మాయిగా, హర్యానాకు చెందిన అమ్మాయిగా నటించాను. నేను ఝాన్సీ కీ రాణిలో పనిచేశాను.
సత్యజిత్ రే చెప్పినట్లుగా, గ్లోబల్‌గా ఉండాలంటే ముందుగా స్థానికంగా ఉండాలి. నేను కూడా దీన్ని చాలా వరకు నమ్ముతాను.
ఇక్కడ క్లిక్ చెయ్యండి