ఏ విషయంలోనైనా కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలియజేసే బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ తాజాగా మరో షాకింగ్ కామెంట్ చేశారు
తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టులో తనను తాను లతా మంగేష్కర్‌తో పోల్చుకుంది కంగనా
తనకు డబ్బు కంటే ఆత్మగౌరవం ముఖ్యమని, గాయని లతా మంగేష్కర్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఎంత డబ్బిచ్చినా పెళ్లిళ్లలో పాడనని చెప్పారని.. నేను అదే ఫాలో అవుతానన్నారు
నా జీవితంలో ఇప్పటివరకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా. కానీ, లతాజీ చెప్పిన ఆ మాటను మాత్రం నేను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నా. ఎంత డబ్బు ఇచ్చినా పెళ్లిళ్లలో డ్యాన్స్ వేయలేదు
భారీ రెమ్యూనరేషన్ ఇస్తాం ఐటెమ్ సాంగ్స్ చేయమంటూ వచ్చిన ఆఫర్లను కూడా తిరస్కరించాను. అవార్డు వేడుకల్లోనూ ఎప్పుడూ డ్యాన్స్ చేయలేదు
డబ్బు కంటే ఆత్మగౌరవం ముఖ్యం. అడ్డదారుల్లో డబ్బు సంపాదించకూడదనే విషయం యువతరం అర్థం చేసుకోవాలంటూ కంగనా రాసుకొచ్చారు
కాగా తాజాగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ, రాధికా అంబానీల ప్రీ వెడ్డింగ్‌లో డ్యాన్స్ చేసిన సెలబ్రెటీలనుద్దేశించే కంగనా వ్యాఖ్యలు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి
అంబానీ ఇంట జరిగిన వెడ్డింగ్ ఫంక్షన్‌కు భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు పాల్గొన్న సంగతి తెలిసిందే