సినిమాలకు గుడ్ బై.. కంగనా బోల్డ్ స్టేట్‌మెంట్‌.

Anil Kumar

21 May 2024

బాలీవుడ్ లేడీ ఓరియంటెడ్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హీరోయిన్ కంగనా రనౌత్.

తాజాగా పాలిటిక్స్ లో రంగప్రవేశం చేసి పలు రకాల వార్తల్లో హెడ్ లైన్ టాపిక్ గా నిలుస్తుంది కంగనా రనౌత్.

నటిగా ఎన్నో విజయాలు సాధించిన కంగనా ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌ సంచలన ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యానికి గురైయ్యేలా చేసారు.

2024 ఎలక్షన్స్ లో ఎంపీగా నిలిబడిన ఈమె తన రాజకీయ ప్రస్థానంపై నోరు విప్పారు. ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

ఈ ఎన్నికల్లో తాను గాని విజయం సాధిస్తే మాత్రం శాశ్వతంగా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తా అన్నారు ఈ బ్యూటీ.

ఉత్తమ ఎంపీగా ప్రజలకు సేవ చేసేందుకు.. ప్రజల్లో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు కంగనా.

అయితే చాలా మంది దర్శకనిర్మాతలు మీరు మంచి నటి, రాజకీయాల్లోకి వెళ్లవద్దన్నారని అని కూడా తెలిపింది కంగనా.