TV9 Telugu

మరో మిస్టరీ మ్యాన్‌తో కంగనా రనౌత్‌.. ఈసారి ఎవరంటే?

29 January 2024

సినిమాలతో పాటు తన బోల్డ్‌ స్టేట్‌మెంట్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది కంగనా రనౌత్‌

సినిమాల సంగతి పక్కన పెడితే ఇటీవల తన ప్రేమ, పెళ్లి విషయాలతో బాగా వార్తల్లో నిలుస్తోందీ అమ్మడు

ఆ మధ్యన ఓ మిస్టరీ మ్యాన్‌తో కంగనా ఫొటోలు దిగడంతో చాలామంది అతనిని కంగనా లవర్ అనుకున్నారు

అయితే ఆ మిస్టరీ మ్యాన్‌ హెయిర్‌ స్టైలిస్ట్‌ అని చెప్పి తన డేటింగ్‌ రూమర్స్‌ను కొట్టిపారేసిందీ అందాల తార

తాజాగా అయోధ్య వెళ్లిన కంగనా రనౌత్‌  అక్కడ ఈజ్‌ మై ట్రిప్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టితో ఫొటో దిగింది

దీంతో ఈ కాంట్రవర్సీ బ్యూటీపై మళ్లీ డేటింగ్‌, రిలేషన్‌ షిప్‌ రూమర్లు తెగ వైరలవుతున్నాయి.

తాజాగా వీటిపై స్పందించిన కంగనా తాను డేటింగ్‌లో ఉన్నానని, అయితే నిషాంత్‌తో కాదంటూ ట్విస్ట్‌ ఇచ్చింది.

సమయమొచ్చినప్పుడు తానే తన ప్రేమ విషయాన్ని అందరికీ చెబుతానంటూ క్లారిటీగా చెప్పుకొచ్చింది కంగనా