అందమే కాదు.. అభినయం కూడా ఈమెను చూసి మురిసిపోతుంది..
26 September 2023
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి తెలియని వారుండరు. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు కంగనా అమర్‌దీప్ రనౌత్.
2006లో గ్యాంగ్ స్టర్ అనే చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ బ్యూటీ. అందం, అభినయంతో ఆకట్టుకుంది.
దీని తర్వాత హిందీలో వో లమ్హే, షకలక బూమ్ బూమ్, లైఫ్ ఇన్ మెట్రో వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది ఈ భామ.
2008లో ధామ్ ధూమ్ చిత్రంతో కోలీవుడ్ కు పరిచయం అయింది అందాల తార కంగనా రనౌత్. దీని తర్వాత మళ్ళి 2021లో తైలవి చిత్రంలో తమిళంలో కనిపించింది.
2009లో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఏక్ నిరంజన్ చిత్రంలో ప్రభాస్ పక్క హీరోయిన్ గా టాలీవుడ్ అరంగేట్రం చేసింది కంగనా.
దీని తరవాత ఏ తెలుగు చిత్రంలో కనిపించలేదు. మళ్ళి ఇన్ని రోజులకి తెలుగు, తమిళం భాషల్లో వస్తున్న చంద్రముఖి 2 చిత్రంతో తెలుగు తెరపై సందడి చేయనుంది.
ఈ చిత్రం ఈ 28న ప్రేక్షకుల వెన్నులో వణుకుపుట్టించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా తెలుగు నేలపై మెరిసింది కంగనా.
ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్ లో తన అద్భుతమైన లుక్స్ లో మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి