ఈ కోమలిని చూసి అందం, అభినయం మురిసిపోతాయి.. కంగనా లుక్స్ ఆసమ్..
TV9 Telugu
26 August 2024
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి తెలియని వారుండరు. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు కంగనా అమర్‌దీప్ రనౌత్.
2006లో గ్యాంగ్ స్టర్ అనే చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ బ్యూటీ. అందం, అభినయంతో ఆకట్టుకుంది.
దీని తర్వాత హిందీలో వో లమ్హే, షకలక బూమ్ బూమ్, లైఫ్ ఇన్ మెట్రో వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది ఈ భామ.
2008లో యాక్షన్ థ్రిల్లర్ ధామ్ ధూమ్ చిత్రంతో కోలీవుడ్ చలనచిత్ర అరంగేట్రం చేసింది అందాల తార కంగనా రనౌత్.
దీని తర్వాత మళ్ళి 2021లో కథానాయకి, తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్ తైలవి చిత్రంతో తమిళంలో కనిపించింది.
2009లో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఏక్ నిరంజన్ చిత్రంలో ప్రభాస్ పక్క హీరోయిన్ గా టాలీవుడ్ అరంగేట్రం చేసింది కంగనా.
మళ్ళి 2023లో తెలుగు, తమిళం భాషల్లో తెరకెక్కిన చంద్రముఖి 2 చిత్రంతో తెలుగు తెరపై మరోసరి కనిపించింది.
ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమాను నటిస్తూ దర్శకత్వం వహిస్తుంది. దీంతో పాటు సైకలాజికల్ థ్రిల్లర్లో నటిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి