22 November 2023

 వరుసగా పరాజయాలు.. అయినా తగ్గేదేలే అంటోన్న క్వీన్ కంగనా.. 

ప్రస్తుతం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది బాలీవుడ్ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌

అయితే ఈ మధ్యన ఈ బాలీవుడ్‌ ట్యాలెంటెడ్‌ బ్యూటీకి వరుసగా అపజయాలు ఎదురవుతున్నాయి.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన తేజస్‌, భారీ అంచనాలతో విడుదలైన చంద్రముఖి 2 రెండూ పూర్తిగా నిరాశపర్చాయి

అంతకు ముందు తమిళం, హిందీ, తెలుగు భాషల్లో నటించిన భారీ చిత్రం తలైవి పూర్తిగా నిరాశపరిచింది

అయితే పరాజయాలను పట్టించుకోకుండా మరో దక్షిణాది మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట కంగనా రనౌత్‌

మాధవన్‌, ఏఎల్‌ విజయ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఓ సినిమాలో కంగనా కథానాయికగా ఎంపికైందట