TV9 Telugu
అలాంటివి ఎవ్వరూ కోరుకోరన్న కంగనా.. వెయిట్ చేస్తున్నానన్న నాగ్ అశ్విన్..
13 Febraury 2024
ఇటీవల తాను ఎమర్జెన్సీ సినిమాలో నటించానని అన్నారు నటి కంగన. ఆ సినిమా త్వరలోనే విడుదల కానుందని చెప్పారు.
ఆ సినిమా చూశాక ఎవరూ తాను సీఎం కావాలని కోరుకోరని అన్నారు ఫైర్‌బ్రాండ్. ఎమర్జెన్సీ సినిమాను కంగన స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారం తెరకెక్కిన ఈ మూవీ జూన్ 14న విడుదల కానుంది.
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్, ఆయన తనయుడు ధ్రువ్ కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా మహాన్.
2022లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మహాన్ సినిమా రిలీజ్ అయి రెండేళ్లయిన విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో మహాన్2 అంటూ విక్రమ్ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
గామి యూనిట్ అత్యంత ప్రేమతో, ఓపికగా అనుకున్నది సాధించారు. దాన్ని చూడ్డానికి వెయిట్ చేస్తున్నా అని అన్నారు డైరక్టర్ నాగ్ అశ్విన్.
విశ్వక్సేన్ హీరోగా నటించిన సినిమా గామి. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. యూనిట్ విడుదల చేసిన మేకింగ్ వీడియోకు మంచి స్పందన వస్తోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి