గొప్ప మనసు చాటుకున్న కమల్.. మహిళా డ్రైవర్ కి అండగా..

తమిళనాడులో జాబ్ పోగొట్టుకున్న మహిళా డ్రైవర్ షర్మిలకు అండగా నిలిచారు కమల్ హాసన్.

ఉద్యోగం కోల్పోయిన ఆ మహిళా డ్రైవర్‌ను పార్టీ ఆఫీస్‌కు పిలిపించి ఓ కారు గిఫ్ట్‌గా ఇచ్చారు.

అంతే కాదు  ఆర్థికసాయం కూడా అందజేశారు అయన.

పార్లమెంట్ సభ్యురాలు  కనిమొళి ఇటీవల కొయంబత్తూర్‌లోని గాంధీపురం నుంచి పీలమేడుకు షర్మిల నడుపుతున్న బస్సులో ట్రావెల్ చేశారు.

ఆ బస్సును నడుపుతున్న షర్మిల ప్రతిభను చూసి కనిమొళి ఆమెకు వాచ్  గిఫ్ట్‌గా ఇచ్చారు.

ఆ సమయంలో బస్సులో ట్రైనీ మహిళా కండక్టర్‌ ఎంపీ కనిమొళితో అనుచితంగా ప్రవర్తించిందని షర్మిల తన యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.

తన పాపులారిటీ కోసం తరచూ బస్సులో సెలబ్రిటీలను ఆహ్వానిస్తుందని ఆ కండక్టర్‌ కూడా షర్మిలపై ఫిర్యాదు చేసింది.

ఈ వివాదంతో షర్మిలను ఉద్యోగం నుంచి యాజమాన్యం తొలగించిన విషయం విదితమే