ఇండియన్ 2 ప్రమోషన్లలో కమల్..
TV9 Telugu
22 May 2024
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న కోలీవుడ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం భారతీయుడు 2.
హీరో సిద్దార్థ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. దీనిలో ఎస్.జె సూర్య కూడా ఓ పాత్రలో నటిస్తున్నారు.
కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో కథానాయకి. రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓ హీరోయిన్. ప్రియా భవాని శంకర్ ముఖ్య భూమిక పోషిస్తుంది.
లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థల్లో సుభాస్కరన్ అల్లిరాజా, ఉదయనిధి స్టాలిన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ కూడా ఖరారైంది. జూలై 12, 2024న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ల స్పీడు పెంచింది టీమ్. ఈ ప్రమోషన్లలో పాల్గొన్నారు లోకనాయకుడు కమల్ హాసన్.
ఇండియన్2 సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు విషయాలను ప్రస్తావించారు కోలీవుడ్ స్టార్ హీరో కమల్‌హాసన్.
తనకు ఇష్టమైన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అని అన్నారు. ధోనీ ప్రయాణం స్ఫూర్తిని పంచుతుందని చెప్పారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి