భారతీయుడు మళ్లీ వచ్చాడు.. ఈసారి మరింత ఎక్సయిటింగా..

Anil Kumar

26 June 2024

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వస్తున్నా భారీ బ‌డ్జెట్ చిత్రం భార‌తీయుడు 2.

ఆ సినిమా జూలై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్‌.

పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్‌ మరోసారి సేనాపతి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది..

ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తున్నారు.

మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్., ఎల్ఎల్‌పి లు ద‌క్కించుకున్నాయి.

ఈ చిత్ర యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో  వినూత్నంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుట్టునే ప్రయత్నం చేస్తుంది.

ఇక ఈ క్ర‌మంలోనే ‘భారతీయుడు 2’ మూవీకి సంబంధించిన ట్రైల‌ర్‌ను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేశారు.

జూలై 12న‌ ఇండియన్ 2 పేరుతో త‌మిళంలో, భార‌తీయుడు 2 పేరుతో వరల్డ్ వైడ్ విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.