సినిమా కోసం అలా కూడా కనిపిస్తా.. ఓపెన్‌గా చెప్పిన నటి

Phani.ch

21 May 2024

పొలిమేర 2 హీరోయిన్‌ కామాక్షి భాస్కర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..  అందాల ఆరబోతతో ప్రెజెంట్ యూత్ క్రష్ గా మారింది ఈ ముద్దుగుమ్మ.

 `ప్రియురాలు` సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కామాక్షి భాస్క‌ర్ల‌. ఈ ముద్దుగుమ్మ స్వ‌త‌హాగా డాక్ట‌ర్ అయితే నటన పై ఉన్న మక్కువతో సినిమాల్లోకి అడుగుపెట్టింది

విరూపాక్ష‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్స్‌, రౌడీ బాయ్స్` తో పాటు ఇటీవ‌ల రిలీజైన ఓం భీమ్ బుష్‌ లో ఇంపార్టెంట్ రోల్స్ చేసింది. ఇప్పుడు `దూత2`లోనూ మెరబోతుంది.

కామాక్షి భాస్కర్ల `పొలిమేర` చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత `పొలిమేర 2`లో బలమైన పాత్రలో కనిపించి అందరిని మెప్పించింది.

అయితే తాజాగా కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ గా తన రోల్స్ పై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి

ఇటీవల ఆమె ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో చిట్‌ చాట్‌ చేసింది. ఇందులో చాలా ఓపెన్ గా రియాక్ట్ అయ్యింది కామాక్షి. తాను బోల్డ్ రోల్స్ కైనా రెడీ అని చెప్పింది. 

ఈ సందర్భంగా యాంకర్‌ న్యూడ్‌గా కనిపించేందుకు మీరు రెడీనా అని అడగ్గా, నేను నటిని, ఏ పాత్ర అయినా చేయడానికి రెడీగా ఉండాలి అని తెలిపింది.

అయితే బోల్డ్ గా చేసినా, సిగ్గు పడుతూ చేసినా అది క్యారెక్టరే అని వెల్లడించింది. యాక్టర్‌ లైఫ్‌ అంతే, యాక్టర్‌లాగే చూడాలి అని తెలిపింది.