కొత్త లోక కలెక్షన్ల సునామీ.. కళ్యాణి ప్రియదర్శన్ ఆస్తులు ఎంతంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగుతుంది. కారణంగా బాక్సాఫీస్ వద్ద కొత్త లోక చాప్టర్ 1 చంద్ర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే.
తాజాగా ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్ లోకి చేరింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో కళ్యాణి పేరు మారుమోగుతుంది. ఈ అమ్మడు గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు.
కళ్యాణి ప్రియదర్శన్.. తెలుగులో ఆమె చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్. కానీ మలయాళంలో మాత్రం వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతుంది.
నివేదికల ప్రకారం కళ్యాణి ప్రియదర్శన్ ఆస్తులు రూ.10 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఆమె ఒక్కో సినిమాకు కోటి వరకు పారితోషికం తీసుకుంటుందని టాక్.
మలయాళంలో ఆమె వరుస హిట్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. దీంతో ఈ బ్యూటీకి నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం పెరిగిపోయింది.
కళ్యాణి సినిమాలే కాకుండా స్కిన్‌కేర్, ఫ్యాషన్ , లైఫ్‌స్టైల్ ఉత్పత్తుల వంటి లగ్జరీ బ్రాండ్స్ ప్రమోట్ చేస్తుంది. అలాగే ఒక్కో ఈవెంట్ కు 15 లక్షలు తీసుకుంటుంది.
సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈబ్యూటీ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
కొత్త లోక చాప్టర్ 1 చంద్ర తర్వాత మలయాళంతోపాటు తెలుగు,, తమిళంలోనూ ఈబ్యూటీకి వరుస అవకాశాలు రానున్నాయని ఫిల్మ్ వర్గాల్లో టాక్.