ఒక్క సినిమా మర్చేసింది గురు.. అందానికి క్యూ కట్టిన ఆఫర్స్.. అమ్మడి జోరు ఆగేలా లేదుగా..
14 September 2025
Phani Ch
కళ్యాణి ప్రియదర్శన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ప్రముఖ మలయాళ, తెలుగు, హిందీ సినిమా దర్శకుడు ప్రియదర్శన్ కూతురు ఈ ముద్దుగుమ్మ .
మలయాళ నుండి టాలీవుడ్ లో అడుగుపెట్టిన చాలామంది హీరోయిన్స్ లో కళ్యాణి ప్రియదర్శన్ కూడా ఒకరు. అక్కినేని అఖిల్ హీరోగా హలో సినిమా తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
అందరిలా ఏదో సినిమాలు చేశాను అన్నట్టు కాకుండా తనదైన ఒక యూనిక్ స్టైల్ ఫాలో అయ్యారు అంటున్నారు నెటిజన్స్.
గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. చేసిన కొద్దీ సినిమాలైనా తనదైన మార్క్ చూయిస్తూ సక్సెస్ ఫుల్ గా రాణించారు.
ఆ తర్వాత తెలుగులో చిత్రలహరి, రణరంగం వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో ఆమెకు తెలుగులో వరుసగా అవకాశాలు తగ్గిపోయాయి.
చేసేదేమీ లేక మలయాళం వైపు అడుగులు వేసిన ఈమె.. అక్కడే వరుస అవకాశాలు అందుకుంటూ మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతోంది.
తెలుగుతోపాటు తమిళం, మలయాళ సినిమాల్లో నటిస్తూనే వరుస వెబ్‌సిరీస్‌లతో ఓటీటీలోనూ అలరిస్తున్నది. తాజాగా ‘కొత్త లోక-చాప్టర్ 1’ సినిమాలో సూపర్ పవర్స్ ఉన్న పాత్రతో ప్రేక్షకులను పలకరించింది.