అందం అనే పేరు ఈమెను చూసే పుట్టిందేమో..

26 October 2023

5 ఏప్రిల్ 1993న చెన్నైలో డైరెక్టర్ ప్రియదర్శన్, నటి లిస్సీ దంపతులకి జన్మించింది అందాల భామ కళ్యాణి ప్రియదర్శన్.

ఈమెకు ఒక చెల్లి, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. చెన్నైలోని లేడీ ఆండాల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ భామ.

తరువాత సింగపూర్‌లో చదువుకుంది బ్యూటీ కళ్యాణి. అక్కడ థియేటర్ గ్రూపులలో కూడా పనిచేసింది ఈ వయ్యారి భామ.

తర్వాత న్యూయార్క్ లో పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ఆర్కిటెక్చర్ డిజైనింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందింది ఈ భామ.

ఈ సమయంలో విలియమ్స్‌టౌన్ థియేటర్ ఫెస్టివల్‌లో థియేటర్‌లో కూడా శిక్షణ పొందింది అందాల భామ కళ్యాణి ప్రియదర్శన్.

న్యూయార్క్ తిరిగి వచ్చిన తర్వాత పాండిచ్చేరిలోని ఆదిశక్తి థియేటర్‌లో జరిగిన ఒక యాక్టింగ్ వర్క్‌షాప్‌కు హాజరయింది ఈ బ్యూటీ.

2017లో అఖిల్ కి జోడిగా హలో అనే తెలుగు చిత్రంతో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది వయ్యారి భామ కళ్యాణి.

2019లో చిత్రలహరి, రంగరంగం చిత్రంల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు ఈ బ్యూటీ.