'డెవిల్‌'పై కల్యాణ్‌రామ్‌ క్లారిటీ.. సముద్రంలో 'తండేల్‌'..

29 December 2023

TV9 Telugu

డెవిల్‌ సినిమా కథ గురించి ట్రైలర్‌లోనే పూర్తిగా క్లారిటీ ఇచ్చేశామని అన్నారు హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌.

మర్డర్‌ మిస్టరీకి, సీక్రెట్‌ సర్వీస్‌కి ఉన్న లింకేంటన్నది చిత్రంలో ఆసక్తికరమని అన్నారు కళ్యాణ్ రామ్.

ఆద్యంతం కల్పిత కథే అయినప్పటికీ, సినిమా చూసేవారికి మాత్రం ఇది.. ఎక్కడైనా జరిగిందా? అనే అనుమానం కలుగుతుందని అన్నారు.

అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రమిది. సంయుక్త మీనన్ కథానాయక. మాళవిక నాయర్ కీలక పాత్రలో నటించారు.

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా సినిమా తండేల్‌. వైవిధ్యమైన నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది.

ఇంతకు మునుపు ఎప్పుడూ కనిపించని గెటప్‌లో అక్కినేని నాగచైతన్య కనిపిస్తారని వెల్లడించారు తండేల్‌ మూవీ మేకర్స్.

ప్రస్తుతం జరుగుతున్నషెడ్యూల్‌లో కీలకమైన యాక్షన్‌ సీక్వెన్స్ తో పాటు, సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్.

ప్రస్తుతం సముద్రం మధ్యలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్ సినిమాలో చాల కీలకమైనవని అన్నారు మేకర్స్.