'కల్లు కాంపౌండ్ 1995' ట్రైలర్..

TV9 Telugu

14 April 2024

యంగ్ హీరో గణేష్, ఆయూషి పటేల్ జంటగా ప్రవీణ్ జెట్టి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'కల్లు కాంపౌండ్ 1995'.

ఈ చిత్రాన్ని బ్లూ హారీజోన్ మూవీ ప్యాక్టరీ బ్యానర్ పై హారిక జెట్టి, పిట్ల విజయలక్ష్మీ సంయుక్తంగా నిర్మించారు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న పోసాని కృష్ణమురళి, జీవా, ప్రవీణ్, బాలచందర్, గౌతమ్ రాజు, చిట్టి బాబు కీలకపాత్రదారులు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ నగరంలోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు మేకర్స్.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ 'కల్లు కాంపౌండ్ 1995' ట్రైలర్ విడుదల చేసారు.

తర్వాత ఆయన మాట్లాడుతూ ట్రైలర్ బావుందని మెచ్చుకున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి మెసేజ్‌ ఉన్న సినిమా అని చెప్పారు.

వాస్తవ సంఘటనల నేపథ్యంలో చాలా బాగా తెరకెక్కించాని మూవీ టీంని ప్రశంసించారు దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్.

సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ మెప్పిస్తుందని, సక్సెస్ ఫుల్ గా బెటర్ అవుట్ పుట్ తీసుకోనిరాగలిగాం అన్నారు మూవీ మేకర్స్.