యూట్యూబ్‌లో దడ పుట్టిస్తున్న కల్కి వేట..
TV9 Telugu
18 June 2024
ప్రభాస్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా కల్కి 2898 AD. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై మంచి హైప్ ఏర్పడింది.
ఈ ట్రైలర్ భారీ వ్యూస్ తో యూట్యూబ్‌ను షాక్ చేస్తుంది. 24 గంటల్లో ఐదు భాషల్లో 34 మిలియన్ల వ్యూస్ వచ్చిన తొలి ట్రైలర్ ఇది.
అత్యధికంలో హిందీలో 16 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్‌లో రికార్డ్స్ క్రియేట్ చేసింది కల్కి 2898 AD ట్రైలర్.
తర్వాత తెలుగులో యూట్యూబ్ వేదికగా 24 గంటల్లో 14 మిలియన్లు భారీ వ్యూస్ అందుకుని బుజ్జితో కలిసి దుమ్మురేపాడు భైరవ.
తమిళంలోనూ ట్రెండ్ సెట్ చేసింది కల్కి ట్రైలర్. ఇక్కడ 2.3 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్‌ను షాక్ చేస్తుంది.
దీని మలయాళం ట్రైలర్ కూడా యూట్యూబ్‌ని అల్లాడించింది. ఇక్కడ కల్కి ట్రైలర్ 24గంటల్లో 1 మిలియన్ వ్యూస్ రాబట్టింది.
శాండల్ వుడ్ ప్రేక్షకులకు కూడా తెగ నచ్చేసింది నాగి ప్రపంచం. కన్నడలో 24 గంటల్లో 949K వ్యూస్ రాబట్టి ట్రెండ్ సెట్ చేసింది.
జూన్ 27న రానున్న ఈ సినిమా తొమ్మిది రోజుల్లోనే యూఎస్ ప్రీ బుకింగ్స్ లో 2 మిలియన్లు వసూళ్లతో మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ దూసుకుపోతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి