కల్కి నయా లుక్.. బాలయ్య మాస్ అవతారం..

TV9 Telugu

11 March 2024

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారతీయ ఇతిహాసం సైన్స్-ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం కల్కి 2898 ఏడి.

ఈ చిత్రంలో డార్లింగ్ సరసన దీపికా పాడుకొనే నటిస్తుంది. అలాగే హీరోయిన్ దిశా పటాని కీలక పాత్రలో కనిపించనుంది.

తాజాగా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదలైంది. భైరవగా ఇందులో నటిస్తున్నారు ప్రభాస్.

మే 9న కల్కి రానుందని మరోసారి ఖరారు చేసారు. ప్రస్తుతం ఇటలీలో ప్రభాస్, దిశాలతో ఓ మాస్ సాంగ్ షూట్ జరుగుతుంది.

శివరాత్రి సందర్భంగా కన్నప్ప ఫస్ట్ లుక్ విడుదల చేసారు మేకర్స్.  మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

శివయ్య ప్రియ భక్తుడైన కన్నప్ప లుక్‌ శివరాత్రి రోజే విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

శివరాత్రి సందర్భంగా బాలయ్య మరోసారి మాస్ అవతారం చూపించారు. ఎన్నికల కోసం బ్రేక్ తీసుకోవడంతో.. కొన్ని రోజులుగా షూట్ జరగట్లేదు.

కానీ టీజర్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు బాబీ. సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా.. ఇట్స్ కాల్డ్ హంటింగ్ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ భలే పేలింది.