ప్రభాస్ అన్న కల్కీ గురించి ఖతర్నాక్ అప్‌డేట్..  

TV9 Telugu

20 March 2024

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న ఇండియన్ ఎపిక్ సైన్స్-ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం డ్రామా ‘కల్కి 2898 AD’.

ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ మధ్యే ప్రభాస్, దిశా పటానిపై ఓ రొమాంటిక్ సాంగ్‌ చిత్రీకరించారు నాగ్ అశ్విన్.

ప్రస్తుతం శంకరాపల్లిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. తర్వాతి షెడ్యూల్‌ను RFCలో మొదలు పెట్టబోతున్నారు.

దీనికోసం ప్రత్యేకంగా సెట్ వేసారు. ఇందులో కమల్ హాసన్, ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు.

ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె కథానాయకిగా నటిస్తుంది. దిశా పటాని కీలక పాత్రలో నటిస్తుంది.

ఈ చిత్రం మే 9న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఎన్నికలు కారణంగా వాయిదా పడేలా కనిపిస్తుంది.

ఇదే జరిగితే స్వతంత్ర దినోత్సవం కనుక విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పుడు పుష్ప 2 విడుదల కానుంది.

ఇక మారుతి దర్శకత్వంలో నటిస్తున్న రొమాంటిక్ హారర్ రాజా సాబ్ సినిమాకి కూడా డేట్స్ అడ్జస్ట్ చేసారు డార్లింగ్.