సలార్‌ 2 కోసం వెయిటింగ్‌ అంటున్న కల్కి డైరెక్టర్ నాగి..

Anil Kumar

19 July 2024

ప్రస్తుతం ఇండియాలో ఉన్న అన్ని థియేటర్లలో ‘కల్కి 2898 AD’ సినిమా సక్సెస్ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.!

అయితే ఇప్పటికి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ఈ చిత్రాన్ని ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఆదరిస్తున్నారు.

నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌ ని అందరూ ప్రశంసిస్తున్నారు. దీపికా, అమితాబ్, కమల్ పాత్రలకు మార్కులు వేస్తున్నారు.

కేవలం పదిహేను రోజుల్లోనే కల్కి సినిమా 1000 కోట్లు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రభాస్ అదరకొట్టాడు.

అయితే తాజాగా ప్రశాంత్ సలార్ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నా అన్నారు కల్కి 2898 ఏడీ దర్శకుడు నాగ్ అశ్విన్‌.

గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే తనకు చాలా ఇష్టమన్న నాగీ, సలార్‌ కూడా అలాగే అనిపిస్తుందన్నారు. అందుకే వెయిట్ చేస్తున్నా

అందుకే ఈ సినిమా సీక్వెల్‌ను బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని చెప్పుకొచ్చారు నాగి.

ఇక వారి కోసమే అన్నట్టుగా కల్కి 2898 AD సినిమాకి సంబంధించిన ఓటీటీ న్యూస్ ఇప్పుడు తాజాగా బయటికి వచ్చింది.