ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా కల్కి 2898 ఏడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచ సినిమా ప్రియులు అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ హీరోలా ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు అనే చెప్పాలి.
ఈ సినిమాలో ప్రభాస్ బాడీ మొత్తం సూట్ ధరించి కనిపించడంతో ప్రభాస్ హాలీవుడ్ మార్వెల్ స్టైల్‌లో ఉన్నాడంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు.
అయితే ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ట్రైలర్ మాత్రం ఓ రేంజ్‌లో ఉందనే చెప్పాలి.
కల్కి 2898 ఏడీ ట్రైలర్యూ ట్యూబ్‌లో రిలీజ్ అయిన అతి కొద్ది గంటల్లోనే ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ ట్రైలర్ చూసి అందరు ఆశ్చర్యపోయారు.
ఈ మూవీ జూన్ 27న గ్రాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఓ న్యూస్ బయటకొచ్చి నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఇటీవల ఓపెన్ అయ్యాయి. అయితే ఈ బుకింగ్స్ విషయంలో కల్కి మూవీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రికార్డును బద్దలు కొట్టింది.