TV9 Telugu
అందుకే కల్కి అనే టైటిల్.. సలార్ సాంగ్..
29 Febraury 2024
ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాకు సంబంధించిన ఒక్కో అప్‌డేట్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తుంది.
తాజాగా రానాతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ సినిమా టైటిల్ వెనుక కథను రివీల్ చేశారు.
ఈ మూవీ మహాభారత కాలంలో ప్రారంభమై 2898 ఏడీలో ముగుస్తుంది. అందుకే ఈ సినిమాకు కల్కి 2898 ఏడీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా చెప్పారు.
ఇండియన్ స్క్రీన్ మీద అవెంజర్స్ తరహా సినిమా అన్నారు దర్శకుడు. ఇందులో దీపికా పదుకొనె కథానాయకిగా నటిస్తుంది.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్.
గత ఏడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లకు పైగా భారీ వసూలు చేసింది.
డిజిటల్‌లోనూ రప్ఫాడిస్తుంది సలార్ సినిమా. తాజాగా ఈ సినిమా నుంచి వినరా అంటూ సాగే వీడియో సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.
ఇందులో శృతి హాసన్ కథానాయక. పృథ్విరాజ్ సుకుమారన్, ఈశ్వరి రావు, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలక పాత్రదారులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి