పెళ్లి తరువాత భర్త తో కలసి  కాజల్ చుసిన మొదటి సినిమా అదేనట 

Phani.ch

23 May 2024

ముద్దుగుమ్మ  కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందాలతో కుర్రకారు గుండెలను కొల్లగొట్టించి ఈ చిన్నది.

కాజల్ పెళ్లి తర్వాత కూడా కెరీర్ లో బిజీగా ఉంది. మ్యారేజ్ తర్వాత కాజల్ భగవంత్ కేసరి లాంటి హిట్ సొంతం చేసుకుంది. 

అంతేకాకుండా సోలోగా తన సత్తా చూపించేందుకు రెడీ అవుతోంది. కాజల్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం సత్యభామ ఈ నెల 31న రిలీజ్ కి రెడీ అవుతోంది.

 ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది కాజల్. మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ పెళ్లి తర్వాత తన కెరీర్ ఎలా మారింది సంగతులని వివరించింది

ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ అంతా సాఫీగా సాగుతుందని తెలిపింది. అంతే కాదు తన కొడుకుతో  టైమ్ కేటాయించలేకపోతున్నాను దానికి కొద్దిగా బాధగా ఉందని తెలిపింది.

అయితే మీ పెళ్లి తర్వాత మీ భర్తకి చూపించిన మొదటి సినిమా ఏంటి అని యాంకర్ ప్రశ్నచింది. ఏమాత్రం ఆలోచించకుండా మగధీర అని చెప్పింది కాజల్.

మగధీర ఇద్దరం కలిసి  చూశాం. కానీ గౌతమ్ కి ఏమి అర్థం కాలేదు. విజువల్స్ మాత్రం మెస్మరైజింగ్ గా ఉన్నాయని చెప్పినట్లు కాజల్ పేర్కొంది.