బన్నీ లో ఆ క్వాలిటీ అంటే బాగా ఇష్టం.. కాజల్ కామెట్స్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు.
వయస్సు పెరుగుతున్నా కాజల్ ను అభిమానించే అభిమానుల సంఖ్య తగ్గడం లేదు.
ఒక కొడుకుకు తల్లి అయినా ఫిట్ గా కనిపిస్తూ కాజల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు.
తాజాగా అభిమానులతో ముచ్చటించిన కాజల్ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఇండియన్2 మూవీ షూట్ లో పాల్గొంటున్నానని ఈ సినిమాలోని నా రోల్ విషయంలో సంతృప్తితో ఉన్నానని కాజల్ పేర్కొన్నారు.
అభిమానులతో ఎందుకు చాట్ చెయరనే ప్రశ్నను కాజల్ అడిగారు.
ప్రొఫెషనల్ లైఫ్ ను, పర్సనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకోవాలని అభిమానులు సైతం ఈ విషయాలను అర్థం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
బన్నీ గురించి ఏమైనా చెప్పాలని అభిమాని కోరారు.
నాకు తెలిసిన మంచి వ్యక్తులలో బన్నీ కూడా ఒకరని బన్నీ ఎనర్జీని ఎంతగానో ఇష్టపడానని కాజల్ చెప్పుకొచ్చారు.
ఇక్కడ క్లిక్ చేయండి