ఏంటి? మహేశ్ నటించిన ఆ డిజాస్టర్ మూవీ కాజల్ ఫేవరెట్ సినిమానా?

TV9 Telugu

23 May 2024

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా  సుదీర్ఘ కాలం పాటు కెరీర్ కొనసాగిస్తోన్న అందాల తారల్లో  కాజల్ అగర్వాల్ కూడా ఒకరు.

2007లో లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగమ్మ నేటికీ వరుసగా సినిమాలు చేస్తోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో కమల్ హాసన్ భారతీయుడు 2 తో పాటు సత్యభామ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమా కూడా ఉంది

ప్రస్తుతం ఈ రెండు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోందీ ఈ ముద్దుగుమ్మ.

కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన టాప్ 3 సినిమాలు చెప్పమని యాంకర్ అడగగా ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది.

మహేష్ బాబుతో తాను జంటగా నటించిన బ్రహ్మోత్సవం సినిమా తనకు చాలా ఇష్టమని చెప్పింది కాజల్ అగర్వాల్.

అందులో తన క్యారెక్టర్ రియల్ లైఫ్ లో తన  క్యారెక్టర్ కి చాలా దగ్గరగా ఉంటుందిని అందుకే ఈ మూవీ తనకు చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చింది కాజల్.

బ్రహ్మోత్సవం సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ సినిమా. అలాంటి మూవీ తన ఫేవరెట్ అని చెప్పడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.