15 May 2024
ఎన్టీఆర్ కోసమే ఆ స్పెషల్ సాంగ్ చేశాను.. కాజల్ అగర్వాల్..
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచేసిన అందమైన చందమామ కాజల్ అగర్వాల్. తొలి సినిమాతోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఈ ముద్దుగుమ్మ.
తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. కొన్నాళ్ల క్రితమే తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది. వీరికి నీల్ కిచ్లూ అనే బాబు జన్మించాడు.
చాలాకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్.. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. ఆమె నటించిన సత్యభామ సినిమాకు త్వరలో రిలీజ్ కానుంది.
ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్.. తాజాగా అలీతో సరదాగా షోలో పాల్గొంది. ఈ క్రమంలో కొన్ని విషయాలు పంచుకుంది.
అనేక హిట్ చిత్రాల్లో నటించిన కాజల్ జనతా గ్యారేజ్ సినిమాలో మాత్రం స్పెషల్ సాంగ్ చేసింది. ఈ పాట అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
అయితే జనతా గ్యారేజ్ సినిమాలో కేవలం ఎన్టీఆర్ కోసమే స్పెషల్ సాంగ్ చేశానని తెలిపింది. ఆ పాట తనకు ఛాలెంజింగ్‌గా అనిపించిందని చెప్పుకొచ్చింది.
అలాగే అందరిలాగే తాను కూడా పాత్రను బట్టి పారితోషికం తీసుకుంటానని తెలిపింది. తనకు ఇండస్ట్రీలో సమంత, తమన్నా ఇద్దరే బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిపింది.
బన్నీ తనకు విలువైన సలహా ఇచ్చాడని.. ఇప్పటికీ దానినే పాటిస్తున్నానని తెలిపింది. కెమెరా ఆఫ్ చేశాక కాసేపు అదే ఎమోషన్లో ఉండాలని చెప్పారని తెలిపింది.