15 October 2025

కాజల్ మెరిసే చర్మం రహస్యం ఇదే.. అందం కోసం ఏం చేస్తుందంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్‏లో చక్రం తిప్పిన హీరోయిన్ కాజల్. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. బిడ్డ పుట్టిన తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు చూస్తుంది. 

ఇప్పుడు ఈ బ్యూటీ అందం, ఫిట్నెస్ గురించి అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పటికీ అలాగే ఎంతో అందంగా, గ్లామర్ ఫిట్నెస్ తో ఆశ్చర్యపరుస్తుంది. 

అందం కోసం కాజల్ తప్పనిసరిగా మాయిశ్చరైజింగ్, సన్ స్క్రీన్, హైడ్రేషన్ నైట్ సిరమ్ వాడతానని అంటుంది. అవి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయట. 

అలాగే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వ్యాయామాలు, యోగా, వర్కవుట్స్ అస్సలు తప్పించనని.. రోజూ దినచర్యలో 40 నిమిషాలు వర్కవుట్స్ చేస్తానని అంటుంది. 

అలాగే సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇస్తానని అంటుంది. తాజా పండ్లు, ఆకుకూరలు, కొబ్బరి నీళ్లు, రోజూ వారీ డైట్ లో తప్పనిసరిగా తీసుకుంటుందట. 

పైగా పండ్ల సహజ చక్కెరలతో తక్షణ శక్తి, ఆకుకూరల ద్వారా పోషకాలు, నట్స్ ద్వారా అవసరమైన కొవ్వులు అందుతాయని, కొబ్బరి నీరు తప్పనిసరిగా తీసుకుంటుందట. 

కొబ్బరి నీరు తనను హైడ్రేటెడ్ గా ఉంచడమే కాకుండా తనను రిఫ్రెష్ గా ఉండేలా చేస్తుందట. తాను ఎలాంటి మోడ్రన్ డైట్స్ ఫాలో కానని అంటుంది టాలీవుడ్ చందమామ. 

బిడ్డకు తల్లైనా తన అందం, ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందట. ఇప్పుడు కాజల్ సౌత్ ఇండస్ట్రీలో సరైన ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.