18 May 2025

మళ్లీ ఫాంలోకి వచ్చిన కాజల్.. ఒక్క సినిమా రెమ్యునరేషన్ ఎంతంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. 

కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్.. ఇప్పుడిప్పుడే సినీరంగంలోకి రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

ఇటీవలే ఇండియన్ 2 చిత్రంలో నటించిన కాజల్.. ఇప్పుడు హిందీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణ్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది.

ఈ మూవీలో రావణుడి భార్య మండోదరి పాత్రలో నటించనుంది. ఈ సినిమాకు దాదాపు రూ.5 కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటుందట కాజల్. 

నివేదికల ప్రకారం కాజల్ అగర్వాల్ ఆస్తులు రూ.83 కోట్లకు పైగానే ఉన్నాయట. సినిమాలే కాకుండా యాడ్స్, ప్రమోషన్స్ ద్వారా భారీగానే సంపాదిస్తుంది.

కాజల్ అగర్వాల్ వద్ద లగ్జరీ కార్లు ఉన్నాయి. రేంజ్ రోవర్ స్పోర్ట్స్, ఆడి A4, స్కోడా ఆక్టేవియా ఉన్నాయి. ముంబైలో 30 కోట్లు విలువైన ఇల్లు కలిగి ఉంది. 

లక్కీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచమయైన కాజల్.. ఆ తర్వాత తెలుగు, తమిళంలో స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది. 

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్న కాజల్.. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది.