13 November 2025
టాలీవుడ్ చందమామ.. కాజల్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ.
ఆ తర్వాత చందమామ సినిమాతో స్టార్ డమ్ అందుకుంది. తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో హిట్స్ చేసింది.
కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇప్పుడు ఈ దంపతులకు బాబు ఉన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కాజల్ హిందీలో రూపొందిస్తునన రామాయణం చిత్రంలో రాణి మండోదరి పాత్రలో నటిస్తుంది. కానీ చాలా కాలంగా తెలుగు సినిమా చేయడం లేదు.
కాజల్ ప్రస్తుతం తన భర్తతో కలిసి ముంబైలో నివసిస్తుంది. నివేదికల ప్రకారం ఈ అమ్మడు ఆస్తులు రూ.88 కోట్లకు పైగా ఉన్నాయని సోషల్ మీడియాలో టాక్.
అలాగే ముంబైలో ఆమె నివసించే ఇంటి విలువ దాదాపు రూ. 30 కోట్లకు పైగానే ఉంటుందట. అలాగే ఆమె వద్ద ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయని సమాచారం.
కాజల్ వద్ద రూ.1.84 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారు ఉంది. అలాగే సినిమాలతోపాటు బ్రాండ్ ప్రమోషన్స్, వ్యాపారం, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టిందట.
సోషల్ మీడియాలో కాజల్ చాలా యాక్టివ్. నిత్యం తన గ్లామర్ ఫోటోషూట్లతోపాటు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్, విషయాలు పంచుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్