ప్రస్తుత కాలంలో సస్పెన్స్-థ్రిల్లర్, హార్రర్ సినిమాలను చూడటానికి చాలామంది ఇష్టపడుతున్నారు. ఇలాంటి సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది.
OTT వచ్చిన తర్వాత ప్రేక్షకులలో ఈ క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. భయం, థ్రిల్ వంటి అంశాలు కలిగిన వెబ్ సిరీస్ OTTలో ఒకటి ఉంది.
2021లో వచ్చిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెబ్ సిరీస్ “లైవ్ టెలికాస్ట్”. ఈ సీరిస్ చూస్తే గూస్‌బంప్స్ గ్యారెంటీ.
అయితే ఈ సీరిస్ కాజల్ అగర్వాల్, ఆనంది, యోగి బాబు నటించిన ఈ సిరీస్ కథ నేటి డిజిటల్ ప్రపంచం చుట్టూ తిరుగుతుంది.
ఈ వెబ్ సిరీస్‌లో జెన్నిఫర్ మాథ్యూ పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించింది. టీఆర్పీ కోసం ఏదైనా చేయగల దర్శకురాలిగా ఆమె అందులో కనిపించింది.
ఈ సిరీస్ లో కాజల్ అగర్వాల్ ఓ గ్రామంలోని హాంటెడ్ హౌస్‌లో చిక్కుకోవడం.. భయానక సన్నివేశంలో చూసి, స్క్రీన్‌కు అవతలి వైపు కూర్చున్న వారికి చెమటలు పట్టడం ఖాయం.
2021లో విడుదలైన ఈ సిరీస్‌లో మొత్తం 7 ఎపిసోడ్‌లు ఉన్నాయి. అన్ని ఎపిసోడ్‌లు ఒకదానికొకటి మెరుగ్గా ఉంటాయి.