TV9 Telugu

మళ్లీ ఫామ్‌ లోకి రావాలని చూస్తున్న కాజల్‌.! నెక్స్ట్ ప్లాన్ అదుర్స్.

03 April 2024

టాలీవుడ్ చందమామ అనగానే టక్కున చెప్పే పేరు కాజల్ అగర్వాల్. లక్ష్మీ కళ్యాణం మూవీతో వెండితెరకు పరిచయం అయ్యింది.

అనతికాలంలోనే ఈ అమ్మడు స్టార్ హీరోలతో నటించే ఛాన్స్లు అందుకుంది. మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

దాదాపు స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది కాజల్. తాజాగా  పెళ్లి చేసుకొని ఈ అమ్మడు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే చివరిగా చిరంజీవి ఆచార్య సినిమాలో నటించిన కాజల్ సడన్ గా ఆ సినిమా నుండి కాజల్ ను తొలగించారు.

ఇటీవలే కాజల్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే ఈ సినిమాలో కాజల్‌ పాత్రకు అంత ఇంపార్టెన్స్ లేకపోవడంతో ప్రేక్షకులు, ఆమె అభిమానులు అసంతృప్తితో ఉన్నారు.

ఇక ఇప్పుడు ఆమె నెక్స్ట్ మూవీస్ మీద ఆశలు పెట్టుకున్నారు కాజల్. ప్రజెంట్ ఇండియన్‌ 2, ఉమ, సత్యభామ సినిమాలు చేస్తున్నారు.

ఫుల్ లెంగ్త్ రోల్ వస్తున్నా సత్యభామ సినిమాతో ఎలాగైన సూపర్ హిట్ అందుకొని తిరిగి ఫామ్‌ లోకి రావాలని చూస్తున్నారు కాజల్‌.