కిల్లింగ్ లుక్స్‌లో కాజల్ స్టన్నింగ్ లుక్స్ 

Phani.ch

04 June 2024

 కాజల్  గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ తరం యంగ్ హీరోల అందరితో నటించి మెప్పించింది.

కాజల్ అగర్వాల్ లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమయ్యారు. అనంతరం చందమామ సినిమా లో నటించింది.

మొదటి సినిమాలో ఎంతో అమాయకంగా నటించినటువంటి ఈమె అనంతరం చందమామ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

ఇలా మగధీర సినిమాతో అందుకున్నటువంటి ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇలా వరుస సినిమాల్లో స్టార్ హీరోలతో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ కొట్టింది.

టాలీవుడ్ హీరోలందరి సరసన నటించిన సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నటువంటి కాజల్ అగర్వాల్ అనంతరం తమిళ హిందీ భాష చిత్రాలలో కూడా నటించింది.

తను కెరీర్ లో ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది. ముంబైకి చెందిన వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది.

పెళ్లి తర్వాత సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చి  ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ గడిపింది కాజల్.  కాజల్  తాజాగా ‘భగవంత్ కేసరి’తో అలరించగా  ప్రస్తుతం ‘సత్యభామ’, ‘ఉమా’, ‘ఇండియన్ 2’ చిత్రాల్లో నటిస్తోంది.