TV9 Telugu
ఆహాలో సందడి చేయనున్న కాజల్.. బట్ షో కాదు అంతకుమించి..
06 April 2024
చాల రోజుల తరువాత టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ హీరోయిన్‌గా నటించిన లేడి ఓరియంటెడ్ మూవీ కార్తిక.
వాస్తవానికి ఈ సినిమా 2023 మే 19న థియేటర్లలో విడుదలైంది. అసలు ఇది తమిళ చిత్రం కరుంగా పియం అనే సినిమా.
తర్వాత కార్తీక పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేసారు.. ఇక ఇక్కడ కూడా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది అనే చెప్పాలి.
అయితే ఈ సినిమా ఇప్పటి వరకు ఓటిటీ లో మాత్రం రాలేదు.ఇక ఈ సినిమా సంబంధించి ఒక అప్డేట్ తెరపైకి వచ్చింది.
ఇక ఇప్పుడు కార్తీక సినిమాను ఏప్రిల్ 9న ప్రముఖ ఓటిటీ సంస్థ ఆహా లో ప్రసారం చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు.
డీకేయ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రెజీనా, జనని, రైజా విల్సన్ తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.
పేవ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై పదర్తి పద్మజ నిర్మించారు. వన్ ఇయర్ తరువాత ఆహాలో రానున్న ఈ సినిమాపై ఆసక్తి బాగానే ఉంది.
ఈ సినిమా హర్రర్ జోనర్ లో తీసారు.. అందుకే కార్తీక మూవీ ఓటిటీ రిలీజ్ కోసం ఎంత ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి