కొడుకు పుట్టాక స్పెషల్ ఫిట్ నెస్ కోసం అలా చేశాను.. కాజల్ మాటలు వైరల్.

Anil Kumar

07 June 2024

ఇప్పటివరకు గ్లామర్ హీరోయిన్ గా టాలీవుడ్ చందమామలా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్..

ఆ మధ్యన పెళ్లి, పిల్లోడు అంటూ కాస్త గ్యాప్ ఇచ్చినప్పటకీ.. ఇప్పుడు జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తోంది కాజల్.

ఇప్పుడు సరికొత్త మేకోవర్ తో కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తుంది. అదే దారిలో తెగ ప్లాన్ చేస్తుంది ఈ అమ్మడు.

ఇక కాజల్ అగర్వాల్ నటించిన లేడీ ఓరియంటెడ్ సత్యభామ సినిమా తాజాగా విడుదలై థియేటర్స్ లో సందడి చేస్తుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ కు సంబంధించి కాజల్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతూ కుర్రకారుని ఆకట్టుకుంటున్నాయి.

తాను మిక్స్డ్ మార్షల్‌ ఆర్ట్స్ లో ఇంతకు ముందే శిక్షణ తీసుకున్నానని.. అది ఈ సినిమాకు యూజ్ అయ్యిందన్నారు.

అంతే కాకుండా తాను తదుపరి చెయ్యబోతున్న సినిమాలకు కూడా వీటి వల్ల ఎంతో ఉపయోగం ఉందని తేలిపారు కాజల్ పాప.

కొడుకు పుట్టిన తర్వాత స్పెషల్ ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ తీసుకున్నట్టు తెలిపారు. యూత్ దీన్ని ఛాలెంజింగ్ గా  తీసుకుంటున్నారు.