47 ఏళ్ల వయసులో జ్యోతిక అందానికి రహస్యం.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..
Rajitha Chanti
Pic credit - Instagram
ఒకప్పుడు తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్లలో ఒకరిగా సత్తా చాటింది జ్యోతిక. అప్పట్లో ఆమెకు ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉండేది.
కోలీవుడ్ హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఈ దంపతులకు ఒక పాప, బాబు ఉండగా.. కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉంది.
చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తుంది. అలాగే ఇప్పుడు ఆమె వయసు 47 సంవత్సరాలు.
ఈ వయసులోనూ ఏమాత్రం తరగని అందంతోపాటు కుర్రహీరోయిన్లకు షాకిచ్చే ఫిట్నెస్ తో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా జ్యోతిక ఫిట్నెస్ సీక్రెట్ బయటకు వచ్చింది.
వ్యాయమాలు, కఠినమైన డైట్స్, అపరిమితమైన ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ ఇవేవి బరువును తగ్గించడంలో సహయపడలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ప్రతిరోజూ వ్యాయమాలు చేయడంతోపాటు ఆలోచనలు, అలవాట్లు, మానసిక స్థితిలను నియంత్రిడంతో పాటు సెల్ఫ్ లవ్, ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యమట.
ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా గడిపితే బరువు తగ్గడం సులభమని చెప్పుకొచ్చింది. అలాగే వ్యాయమంతోపాటు ప్రతిరోజూ యోగా చేయడం అలవాటని తెలిపింది.
మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే సులభంగా బరువు పెరుగుతారని.. అలా కాకుండా ఒత్తిడిని తగ్గించి.. ప్రశాంతమైన మానసిక స్థితి ఉండేలా చూసుకోవాలని అంటుంది.