అదే నచ్చింది: జ్యోతిక..
TV9 Telugu
13 April 2024
గతంలో దాదాపు అందరు సౌత్ హీరోలతో నటించిన జ్యోతిక.. ఇటీవల కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టి దూసుకుపోస్తున్నారు.
2023లో స్టార్ హీరో మోహన్ లాల్ తో కలిసి కథల్ - ది కోర్ అనే ఓ మలయాళీ కోర్ట్ రూమ్ డ్రామాతో చంచలన విజయాన్ని అందుకున్నారు.
తాజాగా హిందీ సూపర్ నాచురల్ హారర్ షైతాన్ సినిమాతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్నారు నటి జ్యోతిక.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోలీవుడ్ స్టార్ హీరో, ఆమె భర్త సూర్య గురించి మాట్లాడారు సీనియర్ స్టార్ నటి జ్యోతిక.
సూర్య అందరినీ గౌరవించే తీరు తనకు చాలా ఇష్టమని అన్నారు అయన బెటర్ హాఫ్, సీనియర్ స్టార్ హీరోయిన్ జ్యోతిక.
అందరికీ సూర్య సమయాన్ని కేటాయించే తీరు చూస్తే ముచ్చటేస్తుందని పొగడ్తలతో ముంచెత్తారు ఈ సౌత్ ఇండియన్ నటి.
స్నేహానికి విలువ ఇస్తారని, సహనం ఎక్కువని, ఎదుటివారు చెప్పే విషయాన్ని ఓపికగా వింటారని మెచ్చుకున్నారు జ్యోతిక.
ప్రస్తుతం బయోగ్రాఫికల్ థ్రిల్లర్ శ్రీకాంత్, డబ్బాకార్టెల్ అనే మరో రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి