రీఎంట్రీలో జ్యోతికకు సాటెవరు?

TV9 Telugu

10 March 2024

రీఎంట్రీలో సీనియర్ హీరోయిన్, సూర్య సతీమణి జ్యోతిక ఎంత జోరు చూపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

బయట ఆమె అప్పియరెన్స్ మాత్రమే కాదు, జ్యోతిక జిమ్‌ లుక్స్ కూడా సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్‌ అవుతున్నాయి.

లేటెస్ట్ గా ఆమె చేసిన వర్కవుట్లు చూసి ఫిదా అవుతున్నారు జనాలు. అంత సీరియస్‌గా ఎందుకు వర్కవుట్లు చేస్తున్నట్టు అని ఆరా తీస్తున్నారు.

ఆల్రెడీ గత ఏడాది మలయాళంలో స్టార్ హీరో మమ్ముట్టితో చేసిన కాదల్‌ సినిమా జ్యోతికకు బాగా క్లిక్‌ అయింది.

ఇప్పుడు బాలీవుడ్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రం సైతాన్‌కి కూడా సూపర్‌డూపర్‌ రెస్పాన్స్ వస్తోంది.

ప్రౌడ్‌ ఆఫ్‌ యూ అంటూ జ్యోతికను ఉద్దేశించి ఆమె భర్త కోలీవుడ్ హీరో సూర్య కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టారు.

అంతే కాదు, జ్యోతిక ఎప్పటికప్పుడు ట్రిప్స్ ప్లాన్‌ చేయడం, పిల్లల చదువు, ఫ్యామిలీ గేదరింగ్స్, ఫెస్టివల్స్ విషయంలో యాక్టివ్‌గా ఉంటున్నారు.

ప్రొడక్షన్‌ హౌస్‌ పరంగా జాగ్రత్తలు తీసుకోవడంలో కూడా బెస్ట్ లేడీ అనిపించుకుంటున్నారు సీనియర్ నటి జ్యోతిక.